APPSC: ఆర్‌ఐఎంసీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2023-02-17T14:41:12+05:30 IST

రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కాలేజ్‌ (Rashtriya Indian Military College) (ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి(2024 జనవరి టర్మ్‌) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) (APPSC) వెబ్‌ నోటిఫికేషన్‌ను

APPSC: ఆర్‌ఐఎంసీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

డెహ్రాడూన్‌ (Dehradun)లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కాలేజ్‌ (Rashtriya Indian Military College) (ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి(2024 జనవరి టర్మ్‌) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) (APPSC) వెబ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జనవరి 1 నాటికి ఏడోతరగతి ఉత్తీర్ణులు/చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల వయసు పదకొండున్నరేళ్ల నుంచి పదమూడేళ్ల మధ్య ఉండాలి.

రాత పరీక్ష: మొత్తం మార్కులు 400. ఇంగ్లీష్‌ నుంచి 125 మార్కులకు, మేథమెటిక్స్‌ నుంచి 200 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు సమాధానాలను హిందీ లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి వైవా వోస్‌ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. ఇందులో ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితర అంశాలు పరీక్షిస్తారు. ఇందులో కూడా అర్హత సాధించినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించగానే ఆర్‌ఐఎంసీ దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్‌, పాత ప్రశ్నపత్రాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపుతుంది. విద్యార్థులు దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి ఏపీపీఎస్సీ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.555

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్‌ 15

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: మున్సిపల్‌ కార్పొరేషన్‌/గ్రామ పంచాయతీ జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌; నివాసం, కులం ధ్రువీకరణ పత్రాలు; బోనఫైడ్‌ సర్టిఫికెట్‌; ఆధార్‌ కార్డ్‌; విద్యార్థి ఫొటోలు 2

చిరునామా: అసిస్టెంట్‌ సెక్రటరీ(ఎగ్జామ్స్‌), ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, న్యూ హెడ్స్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్స్‌ బిల్డింగ్‌, రెండో అంతస్తు, ఆర్‌టీఏ ఆఫీస్‌ దగ్గర, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, ఎంజీ రోడ్‌, విజయవాడ- 520010, ఆంధ్రప్రదేశ్‌

పరీక్ష తేదీ: జూన్‌ 3

పరీక్ష కేంద్రం: విజయవాడ

వెబ్‌సైట్‌: www.rimc.gov.in

Updated Date - 2023-02-17T14:41:14+05:30 IST