Notification: విజయవాడ వైఎస్సాఆర్ హెల్త్ వర్సిటీలో ప్రవేశాలు

ABN , First Publish Date - 2023-07-21T15:51:13+05:30 IST

విజయవాడలోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(డావైఎస్సార్‌యూహెచ్‌ఎ్‌స) - మెడికల్‌, డెంటల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Notification: విజయవాడ వైఎస్సాఆర్ హెల్త్ వర్సిటీలో ప్రవేశాలు

విజయవాడలోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(డావైఎస్సార్‌యూహెచ్‌ఎ్‌స) - మెడికల్‌, డెంటల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌, అనుబంధ, మైనారిటీ మెడికల్‌ ్క్ష డెంటల్‌ కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. స్విమ్స్‌ నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమన్‌(తిరుపతి)లోని ఎంబీబీఎస్‌ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారానే అలాట్‌ చేస్తారు. నీట్‌ యూజీ 2023 స్కోర్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, కౌన్సెలింగ్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎంబీబీఎస్‌ డిగ్రీ వ్యవధి నాలుగున్నరేళ్లు. ఎంసీఐ/ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం మరో ఏడాది కంపల్సరీ మెడికల్‌ రొటేటరీ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. బీడీఎస్‌ డిగ్రీ వ్యవధి నాలుగేళ్లు. మరో ఏడాది పెయిడ్‌ రొటేటింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.

కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల వివరాలు

  • సిద్దార్థ మెడికల్‌ కాలేజ్‌, విజయవాడ - 149

  • ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌, విశాఖపట్నం - 212

  • రంగరాయ మెడికల్‌ కాలేజ్‌, కాకినాడ - 213

  • గుంటూరు మెడికల్‌ కాలేజ్‌, గుంటూరు - 213

  • గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌(రిమ్స్‌), శ్రీకాకుళం - 128

  • గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌(రిమ్స్‌), ఒంగోలు - 102

  • గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, విజయనగరం - 64

  • గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, ఏలూరు - 64

  • గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, మచిలీపట్నం - 64

  • గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, రాజమహేంద్రవరం - 64

  • అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఏలూరు - 125

  • కాటూరి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, గుంటూరు - 75

  • డా. పిన్నమనేని సిద్దార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, గన్నవరం - 75

  • జీఎ్‌సఎల్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, రాజమండ్రి - 125

  • ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, గుంటూరు - 100

  • కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, అమలాపురం - 75

  • గ్రేట్‌ ఈస్ట్రన్‌ మెడికల్‌ స్కూల్‌ అండ్‌ హాస్పిటల్‌, రాజోలు - 75

  • మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, నెల్లిమర్ల - 100

  • ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, విశాఖపట్నం - 75

  • గాయత్రీ విద్యా పరిషత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ అండ్‌ మెడికల్‌ టెక్నాలజీ, విశాఖపట్నం - 100

  • నిమ్రా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, జూపూడి - 75

అర్హత:

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ(బోటనీ, జువాలజీ)/బయోటెక్నాలజీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు; ఓసీ దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి.

  • నీట్‌ యూజీ 2023 కటాఫ్‌: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 137; బీసీ, ఎస్సీ, ఎస్టీ, బెంచ్‌మార్క్‌ వైకల్యం ఉన్న ఎస్సీ/బీసీ అభ్యర్థులకు 107; బెంచ్‌మార్క్‌ వైకల్యం ఉన్న ఎస్టీ అభ్యర్థులకు 108; ఓసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల దివ్యాంగులకు 121 స్కోర్‌ను కటా్‌ఫగా నిర్దేశించారు.

  • వయసు: 2023 డిసెంబరు 31 నాటికి అభ్యర్థుల వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి. అంతకన్నా తక్కువ వయసు ఉన్నవారిని కౌన్సెలింగ్‌కు అనుమతించరు.

ముఖ్య సమాచారం

అప్లికేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.2950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2360

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 26

వెబ్‌సైట్‌: https://drysr.uhsap.in, https://ugcp.ysruhs.com

Updated Date - 2023-07-21T15:51:13+05:30 IST