Iset preparation: ఇలా చదివితే ఐసెట్‌ సులువే...!

ABN , First Publish Date - 2023-03-27T14:46:19+05:30 IST

దాదాపు 50 రోజుల సమయం అధ్యయనానికి లభిస్తుంది. ఈ నేపథ్యంలో అవలంబించాల్సిన వ్యూహాలను తెలుసుకుందాం!

Iset preparation: ఇలా చదివితే ఐసెట్‌ సులువే...!
Iset preparation

రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) ఐసెట్‌ (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. ఐసెట్‌ ద్వారా 2023 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీలో మే 24, 25 , తెలంగాణలో మే 26, 27 తేదీల్లో ఐసెట్‌ (Iset) నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే పరీక్ష కనుక రెండు రోజులు నాలుగు స్లాట్లలో ఉంటుంది. ఇప్పటి నుంచి దాదాపు 50 రోజుల సమయం అధ్యయనానికి లభిస్తుంది. ఈ నేపథ్యంలో అవలంబించాల్సిన వ్యూహాలను తెలుసుకుందాం!

ఎగ్జామ్‌ ప్యాటర్న్‌కు అనుగుణంగా

అభ్యర్థులు తమ అధ్యయనంలో తప్పనిసరిగా ఎగ్జామ్‌ ప్యాటర్న్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఎగ్జామ్‌ ప్యాటర్న్‌ పరిశీలిస్తే....పరీక్షలో మొత్తం 200 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 200. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి... అనలిటికల్‌ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు(మార్కులు 75), మేథమెటికల్‌ ఎబిలిటీ నుంచి 75(మార్కులు 75), కమ్యూనికేషన్‌ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు(50 మార్కులు).

లాజికల్‌ థింకింగ్‌ని పరీక్షించే అనలిటికల్‌ ఎబిలిటీ

లాజికల్‌ థింకింగ్‌లో అభ్యర్థికున్న సామర్థ్యాన్ని పరీక్షించేలా అనలిటికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు ఉంటాయి. అంటే డేటా సఫిషియెన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, డేటా అనాల్సిస్‌, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్‌, డేట్‌ టైమ్‌ అండ్‌ అరేంజ్‌మెంట్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు ఈ విభాగంపై మంచి పట్టు సాధించాలంటే ముఖ్యంగా ఈ కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.

  • ఈ విభాగంలోని ప్రశ్నలు సాధారణంగా ప్యాటర్న్స్‌పైన ఆధారపడేవి. కాబట్టి అభ్యర్థులు ఎంత ప్రాక్టీస్‌ చేస్తే ఇలాంటి ప్రశ్నలకు అంత సులువుగా జవాబులు గుర్తించవచ్చు.

  • ప్రధానంగా కాన్సె్‌ప్ట్సపై పట్టుసాధించాలి. అప్పుడే ఎలాంటి క్లిష్టతరమైన ప్రశ్నకైనా సమాధానం గుర్తించడం తేలికవుతుంది.

  • సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, డేటా సఫిషియెన్సీ, కోడింగ్‌, డీకోడింగ్‌ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రెగ్యులర్‌గా అడుగుతున్నారు. కాబట్టి వీటికి సంబంధించి గత ప్రశ్న పత్రాలను సాధన చేస్తే సరిపోతుంది.

  • అదేవిధంగా పరీక్షలో సమయం కూడా ముఖ్యమైనదే. అందుకోసం ఎక్కువగా షార్ట్‌కట్స్‌ మెథడ్స్‌ను ఉపయోగించడం నేర్చుకోవాలి.

గణన సామర్థ్యాలను కొలిచే మేథమెటికల్‌ ఎబిలిటీ

అభ్యర్థిలో గణన సామర్థ్యాలు(క్యాలిక్యులేటివ్‌ స్కిల్స్‌) ఏమేరకు ఉన్నాయో మేథమెటికల్‌ ఎబిలిటీ విభాగం ద్వారా అంచనా వేస్తారు. అర్థమెటికల్‌ ఎబిలిటీ, ఆల్‌జిబ్రియకల్‌, జామెట్రికల్‌ ఎబిలిటీ, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ అంశాలపై అవగాహన పెంచుకొంటే ఈ విభాగంలో సులువుగా అధిక మార్కులు సాధించవచ్చు.

  • ముఖ్యంగా బేసిక్‌ మేథమెటికల్‌ స్కిల్స్‌ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం పదో తరగతి స్థాయి గణిత పాఠ్యపుస్తకాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకోవడం ఉత్తమం

  • ఈ విభాగానికి సంబంధించి బేసిక్‌ కాన్సెప్ట్‌ కన్నా థియరిటికల్‌ ఐడియాస్‌ పైనే దృష్టి సారించాలి

  • బేసిక్‌ అర్థమెటిక్‌లో ప్రావీణ్యం రావాలంటే రేషియో అండ్‌ ప్రొపర్షన్‌, ఎల్‌సిఎం, జిసిడి, పర్సంటేజ్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, టైమ్‌, డిస్టెన్స్‌ అండ్‌ వర్క్‌ ప్రాబ్లమ్‌, వాల్యూమ్స్‌, రిలేషన్స్‌ అండ్‌ ఫంక్షన్స్‌, మీడియన్‌, మోడ్‌, స్టాండర్డ్‌ డీవియేషన్స్‌ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

  • బేసిక్‌ అల్గరిథమ్‌ పైన మంచి అవగాహన ఉన్నప్పుడే మేథమెటికల్‌ ఎబిలిటీలోని కాంప్రహెన్షన్‌, ఇంట్రప్రిటేషన్‌ ప్రశ్నల్లో ఏమి అడిగారు, ఎలా సాధించాలనే స్పష్టత వస్తుంది.

కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌- భాషపై ప్రజ్ఞకు కొలమానం

భాషలో అభ్యర్థికున్న పఠన, వ్యక్తీకరణ నైపుణ్యాలే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌. కాబట్టి ఈ విభాగంలోని ప్రశ్నలను సులువుగా చేయాలంటే బేసిక్‌ గ్రామర్‌పై పట్టు పెంచుకోవాలి. అందుకోసం వొకాబులరీ, రిటెన్‌ టెక్ట్స్‌ అండ్‌ ప్యాటర్న్‌లను డ్రాయింగ్‌ రూపంలో వ్యక్తపరచడం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా వొకాబులరీ, బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెర్మినాలజిస్‌, ఫంక్షనల్‌ గ్రామర్‌ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఫ ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. ఫ గత ప్రశ్న పత్రాలను సాధన చేయాలి

  • గ్రామర్‌కు సంబంధించి వర్డ్స్‌, రూల్స్‌పై పట్టు సాధించాలి.

రెఫరెన్స్‌ బుక్స్‌

అనలిటికల్‌ ఎబిలిటీ: హౌ టు ప్రిపేర్‌ ఫర్‌ లాజికల్‌ రీజనింగ్‌ - అరుణ్‌ శర్మ

ఏ మోడర్న్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌

మేథమెటికల్‌ ఎబిలిటీ: హౌటు ప్రిపేర్‌ ఫర్‌ క్యాట్‌ - అరుణ్‌ శర్మ

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపెటేటివ్‌ ఎగ్జామ్స్‌ - ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌

కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ- నార్మన్‌ లెవిస్‌

ఇంగ్లీష్‌ గ్రామర్‌ అండ్‌ కంపోజిషన్‌- రెన్‌ అండ్‌ మార్టిన్‌

Updated Date - 2023-03-27T14:47:33+05:30 IST