Gold Seized: వీడి తెలివి తేటలు పాడుగాను..బంగారం ఎలా స్మగ్లింగ్‌ చేస్తున్నాడో చూడండి.

ABN , First Publish Date - 2023-05-26T12:45:04+05:30 IST

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం భారీగా బంగారం పట్టుబడింది. మస్కట్నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను బంగారు స్మగ్లింగ్ చేస్తున్న తీరును చూసి ఎయిర్ పోర్ట్ అధికారులు నివ్వెర పోయారుు. పేస్ట్ రూపంలో బంగారాన్ని అతడు దాచిన ప్లేస్‌ను చూసి అవాక్కయ్యారు.

Gold Seized: వీడి తెలివి తేటలు పాడుగాను..బంగారం ఎలా స్మగ్లింగ్‌ చేస్తున్నాడో చూడండి.

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌(Shamshabad Airport)లో శుక్రవారం భారీగా బంగారం పట్టుబడింది. మస్కట్(Muscat) నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను బంగారు స్మగ్లింగ్ చేస్తున్న తీరును చూసి ఎయిర్ పోర్ట్ అధికారులు నివ్వెర పోయారుు. పేస్ట్ రూపంలో బంగారాన్ని అతడు దాచిన ప్లేస్‌ను చూసి అవాక్కయ్యారు.

నిర్దిష్ట సమాచారం అందుకున్న హైదరాబాద్ కస్టమ్స్, RGIA కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు(Customs Air Intelligence unit of Hyderabad) మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని పట్టుకున్నారు. అతని నుంచి 685.7 గ్రాముల స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 42,78,768 అని అధికారులు తెలిపారు. బంగారు పేస్ట్‌ రూపంలో ప్రయాణికుడి పురీషనాళంలో దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

కాగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికుల నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన 1,800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు సౌదీ అరేబియా నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

Updated Date - 2023-05-26T12:47:40+05:30 IST