Crime News: తప్పు చేసి తిప్పలు పడటం అంటే ఇదే.. ఎవరికీ దొరక్కూడదని చోరీ చేసిన బంగారపు చెయిన్‌ను మింగేశాడు.. తీరా చూస్తే..!

ABN , First Publish Date - 2023-05-30T16:25:03+05:30 IST

ఓ దొంగ ఉపయోగించిన అతి తెలివితేటలు ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. పోలీసులకు చిక్కితే చిక్కాడు కానీ

Crime News: తప్పు చేసి తిప్పలు పడటం అంటే ఇదే.. ఎవరికీ దొరక్కూడదని చోరీ చేసిన బంగారపు చెయిన్‌ను మింగేశాడు.. తీరా చూస్తే..!
Crime News

ఓ దొంగ ఉపయోగించిన అతి తెలివితేటలు ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. పోలీసులకు చిక్కితే చిక్కాడు కానీ ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. తనను కాపాడాలంటూ ఖాకీల కాళ్లావేళ్లా పడుతున్నాడు. అసలు ఇంతకీ ఏమైంది? ఆ దొంగ చేసిన పనేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఈ మధ్య దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. ఎక్కువగా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. పోలీసులు కూడా కేసులను ఛేదిస్తుంటారు. దొంగలను పట్టుకుంటారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. కాకపోతే ఈ దొంగ పోలీసుల బారి నుంచి పారిపోతూ చేసిన మిస్టిక్ ప్రాణాల మీదకు తెచ్చింది.

జార్ఖండ్‌లోని (Jharkhand) రాంచీలో (Ranchi) పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ చైన్ స్నాచర్ బంగారు గొలుసును (gold chain) మింగేశాడు. డోరండా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాది వంతెన సమీపంలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు స్నాచర్లు.. ఒంటరిగా నడుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. గొలుసు లాక్కొని ఇద్దరూ ద్విచక్రవాహనంపై పారిపోతుండగా.. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న ఐదుగురు పోలీసులు వెంబడించారు.

surgery.jpg

ఎట్టకేలకు సల్మాన్‌, జాఫర్‌లను పోలీసులు ఒక కిలోమీటర్ దూరం వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సల్మాన్ తీవ్ర చర్యలకు ఉపక్రమించాడు. పోలీసుల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చోరీకి గురైన బంగారు గొలుసును మింగేశాడు. అయితే సల్మాన్ చైన్ మింగుతుండగా పోలీసులు కూడా చూశారు. దీంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్​రే తీయగా.. గోల్డ్‌ చైన్‌ సల్మాన్‌ ఛాతీ భాగంలో ఇరుక్కుపోయినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే ఆపరేషన్‌ చేయాలని.. లేదంటే ఇన్​ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు. మింగిన చైన్‌ ఎలాగోలా బయటికి వస్తుందిలే అనుకుంటే.. ఏకంగా ప్రాణం మీదికి రావడంతో సల్మాన్‌ లబోదిబోమన్నాడు. తనను కాపాడాలని వైద్యులను.. పోలీసులను వేడుకున్నాడు. కాగా సల్మాన్, జాఫర్ గత 2 నెలలుగా రాంచీలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్​గా వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. వీరు దొంగతనానికి వాడిన బైక్ కూడా చోరీ చేసిందనేని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Bride: ఆ అమ్మాయే కావాలంటూ 13 రోజుల పాటు వధువు ఇంట్లో వరుడు మకాం.. కాసేపట్లో పెళ్లనగా వధువు వెళ్లిపోవడంతో..!

Updated Date - 2023-05-30T16:27:28+05:30 IST