58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం.. ఆ తర్వాత ఎంత కిరాతకంగా ప్రవర్తించాడంటే..?

ABN , First Publish Date - 2023-02-05T18:42:46+05:30 IST

16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి ఆపై అత్యంత కిరాతకంగా చంపేశాడు

58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం.. ఆ తర్వాత ఎంత కిరాతకంగా ప్రవర్తించాడంటే..?

రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. 16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి ఆపై అత్యంత కిరాతకంగా చంపేశాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఫోన్ దొంగతనం కేసుకు సంబంధించి ప్రతీకారంగానే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు నిర్థారించారు. హనుమాన పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని కైలాశపురి గ్రామంలో జనవరి 30న రాత్రి జరిగిందీ ఘటన.

బాధిత మహిళ నోట్లో ప్లాస్టిక్ బ్యాగ్, గుడ్డముక్క కుక్కిన బాలుడు ఆమె ఇంటి పక్కనే నిర్మాణం జరుగుతున్న ఓ భవనంలోకి లాక్కెళ్లాడు. ఆ తర్వాత కొడవలితో తలపైనా, ఇతర శరీర భాగాలపైనా దాడి చేశాడు. కర్రతో ప్రైవేటు భాగాలపై దాడిచేశాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ దారుణ హత్యకు గురైనట్టు ఆ తర్వాతి రోజున సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసినట్టు గుర్తించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, బాధిత మహిళ కుటుంబ సభ్యులు బాలుడిని అనుమానించారు. బాలుడు రెండేళ్ల క్రితం వరకు తమ ఇంట్లో టీవీ చూసేందుకు వచ్చే వాడని పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో వారింట్లో మొబైల్ ఫోన్ మాయం కావడంతో అది ఆ కుర్రాడే తీశాడని ఆరోపించారు. గ్రామస్థులకు ఈ విషయం తెలియడంతో అతడు తన పరువు పోయినట్టు భావించాడు. దీంతో ప్రతీకారం కోసం ఎదురుచూస్తూ వస్తున్నాడు.

జనవరి 30న బాధితురాలి కుమారుడు, భర్త వేరే ఊరు వెళ్లారు. గమనించిన బాలుడు వారి ఇంట్లోకి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళను మంచంపైకి నెట్టేశాడు. భయపడిన ఆమె అరిచేందుకు ప్రయత్నించగా ఆమె నోట్లో పాలిథిన్ సంచి, గుడ్డలు కుక్కేశాడు. ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చట్టేసి తాడు, వైరుతో ఆమెను కట్టిపడేసి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోకి లాక్కెళ్లాడు.

ఆ తర్వాత ఆమెను ఓ డోర్‌కు కట్టేసి దాడిచేశాడు. ఆపై ఆమె చలనం కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఆమె తల, చేతులు, గొంతు, చాతీపై కొడవలితో దాడిచేశాడు. ఆమె ప్రైవేటు భాగాలపై కర్రతో గాయాలు చేశాడు. అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లి 1000 రూపాయల నగదు, నగలు తీసుకుని పరారయ్యాడు.

బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిచ్చిన సమాచారంతో బాలుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన బాలుడిని జువెనైల్ హోంకు తరలించారు.

Updated Date - 2023-02-05T18:42:48+05:30 IST