iPhones: ఐఫోన్ ప్రియులకు బంపర్ న్యూస్.. అమాంతం తగ్గనున్న ధరలు.. కానీ ఓ చిన్న మెలిక!

ABN , First Publish Date - 2023-09-17T17:17:08+05:30 IST

ఐఫోన్, ఆండ్రాయిడ్.. ఈ రెండు మొబైల్స్‌లో ఏది ఉత్తమం అనేది ఎప్పటికీ చర్చనీయాంశమే. అయితే.. ఐఫోన్‌కి ఉన్న డిమాండ్ మాత్రం చాలా ప్రత్యేకం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు..

iPhones: ఐఫోన్ ప్రియులకు బంపర్ న్యూస్.. అమాంతం తగ్గనున్న ధరలు.. కానీ ఓ చిన్న మెలిక!

ఐఫోన్, ఆండ్రాయిడ్.. ఈ రెండు మొబైల్స్‌లో ఏది ఉత్తమం అనేది ఎప్పటికీ చర్చనీయాంశమే. అయితే.. ఐఫోన్‌కి ఉన్న డిమాండ్ మాత్రం చాలా ప్రత్యేకం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే.. ఐఫోన్ నుంచి కొత్త మోడల్ విడుదలైనప్పుడల్లా, దాన్ని కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఇప్పుడు ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కూడా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత మోడళ్లతో పోలిస్తే.. ఈ కొత్త సిరీస్‌‌లో ఫోన్లు మరింత అప్డేటెడ్‌గా వస్తుండటంతో, ఇవి ఎప్పుడెప్పుడు మార్కెట్‌లోకి వస్తాయా? అని వేచి చూస్తున్నారు.


ఇదే సమయంలో.. పాత ఐఫోన్ మోడళ్ల ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. వాటిల్లో ఐఫోన్ 13 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 53,999 ధరకే (కార్డ్ ఆఫర్‌లతో సహా) అందుబాటులో ఉంది. దీన్నిబట్టి చూస్తే... రానున్న రోజుల్లో దీని ధర రూ.50,000లోపు తగ్గే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే మాత్రం.. అధిక-నాణ్యత గల స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి ఐఫోన్ 13 ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది. అవును.. తాజాగా వచ్చే iPhone 15లో ఉండే ఫీచర్స్ ఇందులో ఉండకపోవచ్చు కానీ, ఈ ఐపోన్ 13 ఇప్పటికీ గొప్ప పనితీరు, అద్భుతమైన కెమెరా సామర్థ్యాలు, అందమైన డిస్‌ప్లేతో కూడిన అద్భుత ప్యాకేజీని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఒకవేళ మీకు పెర్ఫార్మెన్స్, నాణ్యమైన కెమెరా, నమ్మకమైన సాఫ్ట్‌వేర్ కలిగిన ఫోన్‌ తక్కువ ధరకే కావాలనుకుంటే.. iPhone 13 ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

ఈ ఐఫోన్ 13 ఫోన్ 2021 సెప్టెంబర్‌లో విడుదలైంది. ఐఫోన్ 12తో పోలిస్తే ఇందులో గొప్ప అప్డేట్స్ ఏమీ లేవు గానీ.. ఇది పవర్‌ఫుల్ A15 బయోనిక్ చిప్‌ని కలిగి ఉంటుంది. అలాగే.. స్టన్నింగ్ రెటీనా అమోల్డ్ డిస్‌ప్లే, మునుపటికన్నా మంచి కెమెరా సామర్థ్యాలు ఇందులో ఉంటాయి. కలర్ ఆప్షన్స్‌తో పాటు 5జీ కనెక్టివిటీకి మద్దతిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా.. ఇది కొన్ని సంవత్సరాల వరకు అప్డేట్స్‌ని అందుకుంటుంది. అంటే.. కొత్త మోడల్స్ విడుదలైనా, ఐఫోన్ 13కి తాజా ఐఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లు అందుతాయి. కెమెరా విషయానికొస్తే.. వెనుకవైపు డ్యూయల్ 12MP కెమెరాలు ఉన్నాయి. సాలిడ్ నైట్ మోడ్‌తో వివిధ లైటింగ్ పరిస్థితుల్లో.. శక్తివంతమైన, వివరణాత్మక ఫోటోలను ఈ తీయొచ్చు. ఐఫోన్ 15‌లో 48MP లెన్స్‌ ఉన్నా.. ఐఫోన్ 13 ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ రంగంలో బలీయమైన పోటీదారుగా నిలుస్తుంది.

Updated Date - 2023-09-17T17:17:08+05:30 IST