RBI: లైట్‌వెయిట్ పేరుతో కొత్త పేమెంట్ వ్యవస్థ..
ABN , First Publish Date - 2023-05-30T19:31:16+05:30 IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. లైట్‌వెయిట్ (lightweight) పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్ పేరుతో మరో కొత్త చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ సోమవారం ప్రకటించిన తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ఇది డిజిటల్ చెల్లింపులకు సమానమైనదని, దీనిని "బంకర్" అని పిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్కువ మంది సిబ్బందితో ఎక్కడి నుండైనా ఆపరేట్ చేయవచ్చని తెలిపింది. ప్రస్తుతం యూపీఐ, ఎన్ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్ చెల్లింపుల వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటికి నెట్‌వర్క్, ఐటీ సదుపాయాలు అవసరం ఉంటుంది.
ప్రకృతి వైఫరీత్యాలు, యుద్ధం వంటి సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రభావం పడినప్పుడు 'లైట్‌వెయిట్ పేమెంట్ వ్యవస్థ ఉపయోగపడనుందని ఆర్బీఐ పేర్కొంది. పరిమిత సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌తో ఈ కొత్త పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది.