Share News

RBI: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. నిబంధనలు కఠినతరం చేసిన రిజర్వ్ బ్యాంక్.. అవేంటంటే?

ABN , First Publish Date - 2023-11-17T13:15:08+05:30 IST

పర్సనల్ లోన్స్(Personnel Loans) తీసుకుంటున్నారా.. అయితే మీకొక అలర్ట్. వ్యక్తిగత రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆదేశాలు జారీ చేసింది.

RBI: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. నిబంధనలు కఠినతరం చేసిన రిజర్వ్ బ్యాంక్.. అవేంటంటే?

ముంబయి: పర్సనల్ లోన్స్(Personnel Loans) తీసుకుంటున్నారా.. అయితే మీకొక అలర్ట్. వ్యక్తిగత రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆదేశాలు జారీ చేసింది. వాటిల్లో ఏముందంటే.. హామీలేని పర్సనల్ లోన్లకు(Loans) రిస్క్ వెయిట్ ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ రుణాలకు 100 శాతం రిస్క్ వెయిట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

విద్య, వాహన, హోం, గోల్డ్ పెట్టి తీసుకునే రుణాలకు ఈ నిబంధనలు వర్తించవని వివరించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా మినహాయింపు ఉంటుందని చెప్పింది. వినియోగదారులు తీసుకుంటున్న రుణాలను సమీక్షించాక.. హామీలేని పర్సనల్ లోన్స్ పై 25 శాతం బేసిస్ పాయింట్లు పెంచి 125 శాతానికి ఫిక్స్ చేసినట్లు వెల్లడించింది.

ఎన్‌బీఎఫ్‌సీల(NBFC)పై ఈ నిర్ణయం భారీగా ప్రభావం చూపుతుందని బ్యాంకర్లు తెలిపారు. .కొత్త నిబంధనలు రుణగ్రహీతలకు రుణ రేట్లను పెంచుతాయని రేటింగ్స్ ఏజెన్సీ ICRA అంచనా వేసింది. అంతేకాకుండా ఫైనాన్స్ కంపెనీలు తమ బాండ్లపై ఎక్కువ వడ్డీని చెల్లించేలా చేస్తాయి.


పెరిగిన క్రెడిట్ కార్డు రిస్క్ వెయిట్...

క్రెడిట్ కార్డుల(Credit Cards) రిస్క్ వెయిట్ ని కూడా 25 శాతం పెంచినట్లు ఆర్బీఐ చెప్పింది. ప్రస్తుతం ఉన్న 125 శాతం నుంచి 150 శాతానికి రిస్క్ వెయిట్ పెంచుతున్నట్లు పేర్కొంది.

చరాస్తులపై ఇచ్చే రుణాలకు హామీ లేని లోన్స్ గా పరిగణించాలని కోరింది. ఆర్బీఐ పరిధిలోని బ్యాంకులన్నీ(Banks) నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. రిస్క్ వెయిట్ పెంచడం బ్యాంకు రుణాలు ఇచ్చే కెపాసిటీని తగ్గిస్తుంది.

Updated Date - 2023-11-17T13:15:10+05:30 IST