Google: గూగుల్ టెక్ జెయింట్‌లో మరిన్ని లేఆఫ్‌లు... సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2023-04-13T10:04:49+05:30 IST

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన చేశారు...

Google: గూగుల్ టెక్ జెయింట్‌లో మరిన్ని లేఆఫ్‌లు... సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన
Google CEO Sundar Pichai

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన చేశారు.(Google) టెక్ జెయింట్(Tech Giant) అయిన గూగుల్ లో మరిన్ని ఉద్యోగాల తొలగింపులు ఉంటాయని సుందర్ పిచాయ్(Google CEO Sundar Pichai) ప్రకటించారు.గూగుల్ సామర్థ్యాన్ని 20 శాతం ఎలా పెంచుతారనే ప్రశ్నకు సమాధానంగా, రీ-ఇంజనీరింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నామని సుందర్ పిచాయ్ చెప్పారు.ఈ ఏడాది జనవరి నెలలో గూగుల్ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం లేదా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఆ తర్వాత రెండవ విడత లేఆఫ్‌లు ఉంటాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూచించారు.గూగుల్ (Google) యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ బార్డ్, జీమెయిల్(Gmail), గూగుల్ డాక్స్, ఇతర ప్రాజెక్ట్‌ల సామర్ధ్యాలు, అవకాశాలపై దృష్టి పెడుతున్నామని సీఈఓ చెప్పారు.

ఇది కూడా చదవండి :Indian students: ఉక్రెయిన్ రిటర్నీ వైద్య విద్యార్థులకు శుభవార్త

అభివృద్ధి జరిగినా మరిన్ని పనులు చేయాల్సి ఉందని పిచాయ్ ఉద్ఘాటించారు.‘‘మేము మా వర్క్‌ఫోర్స్‌లో 12,000 మందిని తొలగించాలని నిర్ణయించుకున్నాం. మేం ఇప్పటికే అమెరికాలో ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఈమెయిల్స్ పంపాం. ఇతర దేశాల్లో స్థానిక చట్టాలు, అభ్యాసాల కారణంగా ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది’’అని సుందర్ పిచాయ్ చెప్పారు. భారతదేశంలోని వివిధ విభాగాల్లో 450 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించినట్లు ఫిబ్రవరిలో నివేదించారు. అయితే తొలగింపుల్లో ఆల్ఫాబెట్ ఇంక్ ప్రకటించిన 12,000 ఉద్యోగాల కోతలు ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

Updated Date - 2023-04-13T10:11:15+05:30 IST