Share News

Diwali Muhurat Trading 2023: మూరత్ ట్రేడింగ్ శుభారంభం..లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2023-11-12T19:32:37+05:30 IST

దీపావళి మూరత్ ట్రేడింగ్ 2023 శుభారంభాన్నిచ్చింది. లాభాల్లో ట్రేడింగ్ మొదలైంది. దీపావళి రోజున నిర్వహించే మూరత్ ట్రేడింగ్‌ను ముంబైలోని అమెరికా కన్సులేట్ జనరల్ మైఖేల్ ఘ్రూడర్, ఐఐఎం జమ్మూ చైర్మన్, పద్మశ్రీ మిలింద్ కాంబ్లే తదితరులు ఎన్ఎస్ఈ బెల్ మోగించి ప్రారంభించారు. ఆదివారం సాయంత్ర 6.15 గంటలకు ట్రేడింగ్ మొదలైంది. గంటసేపు ట్రేడింగ్ జరిగింది.

Diwali Muhurat Trading 2023: మూరత్ ట్రేడింగ్ శుభారంభం..లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: దీపావళి మూరత్ ట్రేడింగ్ 2023 (Diwali Muhurat Trading) శుభారంభాన్నిచ్చింది. లాభాల్లో ట్రేడింగ్ మొదలైంది. దీపావళి రోజున నిర్వహించే మూరత్ ట్రేడింగ్‌ను ముంబైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ మైఖేల్ ఘ్రూడర్, ఐఐఎం జమ్మూ చైర్మన్, పద్మశ్రీ మిలింద్ కాంబ్లే తదితరులు ఎన్ఎస్ఈ బెల్ మోగించి ప్రారంభించారు. ఆదివారం సాయంత్ర 6.15 గంటలకు ట్రేడింగ్ మొదలైంది. గంటసేపు ట్రేడింగ్ జరిగింది. సాయంత్రం 6.21 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 360 పాయింట్లు లాభపడి 65,248 వద్ద కొనసాగగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 19,529 దగ్గర ట్రేడ్ అయింది. ప్రీ-ఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ 600 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 19,600 దగ్గర ట్రేడ్ అయింది. సెషన్‌లోని 15 నిమిషాల్లో ఇండియా, యూపీఎల్, ఎన్‌టీపీసీ, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్‌లు నిఫ్టీ విన్నర్లుగా నిలిచారు. గత ఏడాది, సెన్సెక్స్, నిప్టీలు గంటసేపు ట్రేడింగ్‌లో 0.88 శాతం లాభపడ్డాయి. 2021లో ఈ రెండో 0.49 శాతం లాభపడ్డాయి.


దీపావళి రోజు ఏపనైనా ప్రారంభిస్తే విజయం వరిస్తుందనే భారతీయుల విశ్వాసానికి అనుగుణంగా స్టాక్‌ మార్కెట్‌లో కూడా దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే వచ్చే దీపావళికి వరకూ ఇక లాభాల పంట పండుతుందనే నమ్మకం బలంగా ఉంది. ఈ గంట ట్రేడింగ్‌లో ఒక్క స్టాక్ అయినా కొనాలని కొందరు ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు.

Updated Date - 2023-11-12T19:35:43+05:30 IST