GST Collections: డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు అదుర్స్.. ఎంతపెరిగాయో తెలుసా..

ABN , First Publish Date - 2023-01-01T20:10:08+05:30 IST

గతేడాది 2022 చివరి నెల డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు (GST Collections) గణనీయంగా వృద్ధి చెందాయి. క్రితంఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పెరుగుదలతో రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

GST Collections: డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు అదుర్స్.. ఎంతపెరిగాయో తెలుసా..

న్యూఢిల్లీ: గతేడాది 2022 చివరి నెల డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు (GST Collections) గణనీయంగా వృద్ధి చెందాయి. క్రితంఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పెరుగుదలతో రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక నవంబర్ 2022 వసూళ్లు రూ.1.46 లక్షల కోట్లతో పోల్చితే 11 శాతం మేర పెరుగుదల నమోదయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదివారం గణాంకాలు విడుదల చేసింది. కాగా 2022లో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. ఏప్రిల్‌లో రికార్డ్ స్థాయిలో సుమారు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. అక్టోబర్‌లో రెండవ అత్యధికం రూ.1.52 లక్షల కోట్లుగా నమోదయ్యింది.

డిసెంబర్‌ జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.26,711 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.33,357 కోట్లు, ఐజీఎస్టీ రూ.78,434 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఇక ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.36,669 కోట్లు, ఎస్‌జీఎస్టీకి రూ.31,094 కోట్లు చొప్పున కేంద్ర ప్రభుత్వం సెటిల్ చేసినట్టు ఆర్థికశాఖ పేర్కొంది.

Updated Date - 2023-01-01T20:12:13+05:30 IST