Share News

AI: ఇకపై పెళ్లి వేడుకల్లో కూడా ఏఐ వాడకం..మాములుగా ఉండదుగా!

ABN , Publish Date - Dec 30 , 2023 | 04:02 PM

దేశంలో ఏఐ(artificial intelligence) టెక్నాలజీ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎక్కువగా విద్యా రంగం, తర్వాత వైద్యంలో విరివిగా ఉపయోగించారు. తాజాగా వివాహ వేడుకల వ్యాపారంలోకి కూడా ఏఐ రంగ ప్రవేశం చేసింది.

AI: ఇకపై పెళ్లి వేడుకల్లో కూడా ఏఐ వాడకం..మాములుగా ఉండదుగా!

భారతీయ పెళ్లి(marriage) వేడుకల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. రాష్ట్రాలను బట్టి ఆయా ప్రాంతాల్లో పాటించే సంప్రదాయాల మేరకు అనేక రకాలుగా వివాహ వేడుకలను(wedding celebrations) నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలు క్రమంగా ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయాయి. పెళ్లి తేదీ ఖారారైనప్పటి నుంచి పెళ్లి మండపం, భరత్, ఫోటో షూట్, భోజనాలు సహా మొత్తం వేడుకలను నిర్వహించేందుకు అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి. అంతేకాదు అనేక రకాల ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఇవన్నీ నిర్వహించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. కానీ దేశంలో అనేక చోట్ల పెళ్లి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకల కోసం ఇటివల ఏఐ(artificial intelligence) టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు.


పెళ్లి వేడుకల్లో భాగంగా ఆయా వేడుకలకు వచ్చే క్రమంలో పక్కన ఉన్న ప్రాంతాలకు వర్చువల్ రియాలిటీ విజువలైజ్ డిజైన్ ఉపయోగిస్తున్నట్లు ఈవెంట్స్ నిర్వహకులు తెలిపారు. దీంతోపాటు వేడుకలకు వచ్చే అతిథులకు ఆహ్వానం పలికేందుకు AI పవర్డ్ చాట్‌బాట్‌లను కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు పెళ్లి జరిగే ప్రాంతం లోకేషన్ షేరింగ్, లైవ్ టెలిక్యాస్ట్ వంటి అనేక అంశాలకు కూడా టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపారు.

దీంతోపాటు VR ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ(videography) సహా డ్రోన్ కెమెరాలు ఉపయోగించి వివాహ జ్ఞాపకాలను షూట్ చేస్తున్నట్లు ఈవెంట్స్ మేనేజర్లు చెబుతున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడూ ఫోటోలను చిత్రీకరిస్తూ వాటిని స్టోర్ చేయడంతోపాటు పలు చిత్రాలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు పెళ్లి వేడుకలకు ఎంత మంది వచ్చారనే విషయాలను కూడా ఏఐ ట్రాక్ చేస్తుందని నిర్వహకులు అంటున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతోపాటు అనేక మందికి డిజిటల్ ఆహ్వానాలు కూడా పంపిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఏఐ టెక్నాలజీ వాడకం వల్ల గతంలో కంటే కొంత ఖర్చు తగ్గే అవకాశం ఉందని కూడా ఈవెంట్స్ మేనేజర్లు అంటున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 04:03 PM