Avinash Reddy: వివేకా కేసులో అవినాష్‌రెడ్డికి మరో బిగ్ షాక్..

ABN , First Publish Date - 2023-03-17T17:24:19+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అరెస్ట్ (YCP MP Avinash Reddy) దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డికి 41A నోటీసులు (41A Notices) ఇవ్వాలని..

Avinash Reddy: వివేకా కేసులో అవినాష్‌రెడ్డికి మరో బిగ్ షాక్..

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అరెస్ట్ (YCP MP Avinash Reddy) దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డికి 41A నోటీసులు (41A Notices) ఇవ్వాలని సీబీఐ (Viveka Case CBI Enquiry) నిర్ణయించుకున్నట్లు సమాచారం. విచారణ తర్వాత అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అవినాశ్‌రెడ్డి అరెస్ట్‌ను ఆపలేమని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. శనివారం (మార్చి 17న) అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి పిటిషన్‌ కొట్టివేశాక ఢిల్లీ వేదికగా పెద్ద కథే నడిచింది.

సడన్ టూర్‌లో భాగంగా అసెంబ్లీ సమావేశాలను పక్కనపెట్టి మరీ ఢిల్లీకి వెళ్లిన జగన్‌తో అవినాష్ రెడ్డి భేటీ కావడం గమనార్హం. ఢిల్లీలోని జగన్ నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. వివేకా హత్య కేసు నుంచి తమ్ముడిని బయటపడేసేందుకు జగన్ ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి కూడా జగన్‌తో ఢిల్లీలో భేటీ కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది. అవినాష్ రెడ్డి తనతో భేటీ అయిన గంటల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్‌లో జగన్ భేటీ కావడం కొసమెరుపు.

రాష్ట్ర సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని అధికార వైసీపీ చెబుతున్నప్పటికీ అసలు కారణం మాత్రం వేరే ఉందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు ఇవ్వడం, ఇదే కేసులో మాగుంట కుమారుడు రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉండటం, వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో వైసీపీ అధినేత జగన్‌లో కలవరపాటు మొదలైందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన వాళ్లను కాపాడుకునేందుకే జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు కాళ్లావేళ్లా పడుతూ.. కటాక్షం కోరుతున్నారని ప్రతిపక్ష టీడీపీ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఇక.. వివేకా హత్య కేసుకు తోడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా వైసీపీని కలవరపాటుకు గురిచేశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మూడింటిలో రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తా చాటడంతో అధికార వైసీపీలో గుబులు మొదలైంది.

Updated Date - 2023-03-17T17:25:32+05:30 IST