YCP MLA: ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి వింత అనుభవం..
ABN , First Publish Date - 2023-05-25T20:21:44+05:30 IST
చోడవరం నియోజకవర్గ (Chodavaram Constituency) వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి (YCP MLA Karanam Dharmashree) వింత అనుభవం ఎదురైంది.
అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గ (Chodavaram Constituency) వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి (YCP MLA Karanam Dharmashree) వింత అనుభవం ఎదురైంది. రొలుగుంట మండలం కొండపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని గ్రామస్తులు నిలదీశారు. సాక్షి క్యాలెండర్ తప్ప...జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. కరోనా వల్లే ఆలస్యమైందంటూ కరణం ధర్మశ్రీ సాకులు చెప్పడంతో తెలంగాణలో కరోనా రాలేదా అంటూ గ్రామస్తులు నిలదీశారు. సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వెళ్లిపోయారు.