Share News

TDP : టీడీపీ నాయకుడుపై వైసీపీ నాయకులు బండ రాళ్లతో దాడి

ABN , First Publish Date - 2023-11-10T06:41:15+05:30 IST

చంద్రగిరి మండలం, భీమవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడిపై వైసీపీ నేతలు బండరాళ్లతో దాడి చేశారు. భీమవరం పంచాయతీలో మూలపల్లెకు చెందిన ఈశ్వరి, ఆమె మామ అన్నారెడ్డిలకు మధ్య పొలం వివాదం జరుగుతుంది.

TDP : టీడీపీ నాయకుడుపై వైసీపీ నాయకులు బండ రాళ్లతో దాడి

తిరుపతి : చంద్రగిరి మండలం, భీమవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడిపై వైసీపీ నేతలు బండరాళ్లతో దాడి చేశారు. భీమవరం పంచాయతీలో మూలపల్లెకు చెందిన ఈశ్వరి, ఆమె మామ అన్నారెడ్డిలకు మధ్య పొలం వివాదం జరుగుతుంది. ఈ క్రమంలో ఈశ్వరి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత పోలీసు గ్రామస్తులు సమక్షంలో పంచాయతి నిర్వహించుకుని, సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఈశ్వరికి మద్దతుగా భీమవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడు రాగా.. అన్నారెడ్డికి మద్దతుగా వైసీపీ నాయకుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు.

పంచాయతి తెగకపోవడంతో చంద్రగిరి నుంచి స్వగ్రామం భీమవరానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వైసీపీ నాయకుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అనుచురులు వచ్చి టీడీపీ నాయకుడు మునిరత్నంపై బండరాళ్ళతో తలపై తీవ్రంగా కొట్టారు. ఆపై చేతికి ఉన్న బంగారు కడియం, రూ.10 వేలు నగదు దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మునిరత్నం నాయుడిపై దాడి సమాచారం తెలుసుకున్న చంద్రగిరి టీడీపీ ఇన్చార్జ్ పులివర్తి నాని వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్నారు. మునిరత్నం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం స్విమ్స్‌కు తరలించారు.

Updated Date - 2023-11-10T06:41:16+05:30 IST