Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
ABN , Publish Date - Dec 24 , 2023 | 04:26 PM
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు.
అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలకు చంద్రబాబు తెలుగు దేశం పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీలో భారీ చేరికలతో సందడి వాతావరణం నెలకొంది.