YCP Leader : జగన్‌ను నేను సైకో అనలే..

ABN , First Publish Date - 2023-02-02T13:22:13+05:30 IST

కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్సెస్ వైసీపీ నేతలు దుట్టా రామచంద్ర రావు, యార్లగడ్డ వెంకట్రావు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది కాస్తా తాజాగా ముదిరి పాకాన పడుతోంది.

YCP Leader : జగన్‌ను నేను సైకో అనలే..

విజయవాడ : కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వర్సెస్ వైసీపీ నేతలు (YCP Leaders) దుట్టా రామచంద్ర రావు (Dutta Ramachandra Rao), యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది కాస్తా తాజాగా ముదిరి పాకాన పడుతోంది. తాజాగా వల్లభనేని వంశీపై దుట్టా, యార్లగడ్డలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వైకుంఠపురం (Vykuntapuram)లో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ వైసీపీ నేతలు పాల్గొని చేసిన కామెంట్స్‌ను అక్కడే ఉన్న వాళ్లెవరో రికార్డు చేసి వైరల్ చేశారు. దీనిపై తాజాగా దుమారం రేగుతోంది.

వంశీతో ప్రయాణం కుదరదని చెప్పా..

అయితే కొన్ని మీడియా ఛానళ్ల (Media Channels)లో తాను జగన్‌ను సైకో అన్నట్టుగా వస్తున్న వార్తలను దుట్టా రామచంద్రరావు ఖండించారు. నేడు హనుమాన్ జంక్షన్‌లోని తమ నివాసంలో మీడియా సమావేశంలో దుట్టా మాట్లాడుతూ.. ‘‘గుడి ఓపెనింగ్ నిమిత్తం యార్లగడ్డ నేను కలుసుకున్నాం. కొన్ని చానల్లో సీఎం జగన్ సైకో అన్నట్టుగా వార్తలొస్తున్నాయి. అలా అని మేము అనలేదు. 40 సంవత్సరాల నుంచి నేను డాక్టర్ వృత్తిలో ఉన్నా. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మాకు దగ్గర సంబంధం ఉంది. మేము చచ్చిపోయే వరకు మా కుటుంబ సభ్యులు జగన్ తోనే ఉంటాం. వల్లభనేని వంశీతో కలిసి ప్రయాణం చేయమని అధిష్టానం చెప్పింది. వంశీతో కలిసి నేను ప్రయాణం చెయ్యను అని అధిష్టానానికి చెప్పాను. వంశీ తో గొడవ పడవద్దని అధిష్టానం నాకు చెప్పింది. అధిష్టానం మాటకే కట్టుబడి ఉన్నాను. యార్లగడ్డ వెంకట్రావు కూడా వైసీపీకి కట్టుబడి ఉన్నాడు. సీఎం జగన్‌ని తిట్టే మనస్తత్వం మాది కాదు. అందరం సరదాగా కూర్చుని మాట్లాడుకునే టైంలో ఎవరు రికార్డ్ చేశారు తెలియదు. ఆ వీడియోలో అనకూడని మాటలు ఏమీ లేవు’’ అని పేర్కొన్నారు.

అసలు దుట్టా ఏం మాట్లాడారంటే..

‘‘కొడాలి నాని ఏడో తరగతి తప్పారు. ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్‌కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. నియోజకవర్గానికి వీరు ఎందుకైనా ఉపయోగపడతారా? వల్లభనేని వంశీ, కొడాలి నానికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారని వారు ప్రశ్నించారు. వల్లభనేని వంశీ ఆగడాలను ప్రశ్నించ బట్టే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది’’ అని దుట్టా రామచంద్రరావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-02T13:27:48+05:30 IST