West Godavari: ప్రజలు టీడీపీ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు

ABN , First Publish Date - 2023-03-23T23:15:31+05:30 IST

రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోపాలపురం(Gopalapuram) నియోజకవర్గ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు అన్నారు.

West Godavari: ప్రజలు టీడీపీ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు

పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోపాలపురం(Gopalapuram) నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు చంద్రన్న నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం(TDP government) కోసం ఎదురుచూస్తున్నారని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నాంది అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోగా తాజాగా ఎమ్మెల్యేల కోటాలో సైతం పంచుమర్తి అనురాధ విజయం సాధించడం జగన్ పతనానికి సంకేతం అన్నారు.

ద్వారకా తిరుమల మండలంలోని పావులూరివారిగూడెం, తిరుమలంపాలెం, గ్రామాల్లో మండల పార్టీ అద్యక్షుడు లంకా సత్తిపండు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి ’’ కార్యక్రమం పాల్గొన్న మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ...రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం నుండి భారీ విజయం సాధించి అధినేత చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిని గాలికొదిలేసిన జగన్ ప్రభుత్వం ప్రజలపై పెనుభారాన్నిమోపుతోందని విమర్శించారు. అప్పుల వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్న జగన్ పాలనకు చెక్ పెట్టినప్పుడే సంక్షేమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-23T23:19:03+05:30 IST