AP News: మట్టి అమ్ముతున్న మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లారీల పట్టివేత.. దళితులకు నిమ్మల మద్దతు
ABN , First Publish Date - 2023-06-09T10:04:45+05:30 IST
జిల్లాలోని చించినాడ దళిత భూముల నుంచి ఇటుక బట్టీలకు, ప్రైవేటు స్థలాలకు మట్టి అమ్ముతున్న మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లారీలను మేడపాడులో దళితులు పట్టుకున్నారు. విషయం తెలిసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని దళితులకు మద్దతుగా నిలిచారు.
పశ్చిమగోదావరి: జిల్లాలోని చించినాడ దళిత భూముల నుంచి ఇటుక బట్టీలకు, ప్రైవేటు స్థలాలకు మట్టి అమ్ముతున్న మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లారీలను మేడపాడులో దళితులు పట్టుకున్నారు. విషయం తెలిసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (MLA Nimmala Ramanaidu) సంఘటనా స్థలానికి చేరుకుని దళితులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మట్టి పేరు తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని చెప్పి ఇలా యదేశ్చగా మట్టి అమ్ముకుంటున్న ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై అక్రమ కేసులు పెట్టిన ప్రసాద్ రాజు, కవురు శ్రీనివాసులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు అనర్హులుగా స్పీకర్ ప్రకటించాలన్నారు. మట్టి మాఫియాలో భాగస్వాములైన కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అర్హుడు కాదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు.