Pawan Kalyan: నేను సీఎం అయితే అన్నింటికీ పరిష్కారం కాదు..

ABN , First Publish Date - 2023-06-27T15:31:47+05:30 IST

ప.గో.జిల్లా: తూర్పుకాపుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి బీజం పడింది భీమవరంలోనేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఆయన భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ.. పోరాట యాత్ర 2014లో శ్రీకాకుళం నుంచే మొదలుపెట్టానని...

Pawan Kalyan: నేను సీఎం అయితే అన్నింటికీ పరిష్కారం కాదు..

ప.గో.జిల్లా: తూర్పు కాపుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి బీజం పడింది భీమవరంలోనేనని జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మంగళవారం ఆయన భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ.. పోరాట యాత్ర 2014లో శ్రీకాకుళం నుంచే మొదలుపెట్టానని, ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ వలస కార్మికులు వస్తుంటారని, ఉత్తరాంధ్ర కార్మికులు సాహసికులని పేర్కొన్నారు. తూర్పు కాపుల సంఖ్యను టీడీపీ (TDP) 26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) 16 లక్షలని చెబుతోందని.. కానీ 45 లక్షల మంది తూర్పుకాపులున్నారని పవన్ అన్నారు. ఏ ప్రాతిపదికన వైసీపీ 16 లక్షలని చెబుతోంది?.. పథకాలు అందకుండా చేయడానికి వైసీపీ అలా అంటోందని ఆరోపించారు.

జనసేన అధికారంలోకి వస్తే, తూర్పుకాపుల జనగణన చేపడతామని, చట్టంతో అందరికీ న్యాయం జరిగితే.. కులాలతో సంబంధం లేదని, చట్టం పనిచేయనప్పుడు కులాల వైపు చూస్తామన్నారు. తూర్పుకాపుల్లో బలమైన నాయకులు ఉన్నారని.. వారు ఎదుగుతున్నారు.. కులాన్ని పట్టించుకోవడం లేదన్నది మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కూడా ఆలోచించాలని సూచించారు. తూర్పుకాపుల్లో మంత్రులు ఉన్నారు.. ఎమ్మెల్యేలు ఉన్నారు.. వారు తిన్నాకైనా వారి కులం గురించి ఆలోచించాలన్నారు. ఇతర బీసీ కులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు, తూర్పుకాపులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇవ్వకపోవడానికి హేతుబద్ధత ఏంటన్నారు.

తెలంగాణాలో 31 కులాలను బీసీ జాబితా నుంచి తూర్పు కాపులను తొలగించారని, అయినా అప్పటి నాయకులు పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలి.. బీసీ కులాల జనగణనకు అనుకూలంగా ఉన్నానని పవన్ తెలిపారు. తాను సీఎం అయితే అన్నింటికి పరిష్కారం కాదన్నారు. సీఎం అవ్వడం అన్నింటికీ మంత్రదండం కాదని.. తాను సీఎం అయిన తరువాత చేయాలనుకున్నా.. అధికారులో, నాయకులో అడ్డుపడతారన్నారు. చైతన్యవంతమైన సమాజంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, తాను సీఎం అయినా నన్ను నిలదీసే స్థితికి ప్రజలు రావాలన్నారు.

Updated Date - 2023-06-27T15:31:47+05:30 IST