MP Raghurama: జగన్ ఢిల్లీ యాత్రలో మర్మమేమి?..: రఘురామ

ABN , First Publish Date - 2023-03-18T16:31:18+05:30 IST

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ యాత్ర (Delhi Tour)లో మర్మమేమి? ఒక్క కొత్తం అంశం లేదు.. కానీ ఢిల్లీకి తీసుకొచ్చి ఇచ్చే వేంకటేశ్వర స్వామి బొమ్మ సైజ్ మాత్రం పెరిగిందని....

MP Raghurama: జగన్ ఢిల్లీ యాత్రలో మర్మమేమి?..: రఘురామ

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ యాత్ర (Delhi Tour)లో మర్మమేమి? ఒక్క కొత్తం అంశం లేదు.. కానీ ఢిల్లీకి తీసుకొచ్చి ఇచ్చే వేంకటేశ్వర స్వామి బొమ్మ సైజ్ మాత్రం పెరిగిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (MP Raghurama Krishnamraju) అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రజలు వైసీపీ (YCP)ని తిరస్కరించారని, పులివెందులలో కూడా మెజారిటీ లేదని అన్నారు. పులివెందుల (Pulivendula)లో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. మరీ కుప్పం (Kuppam) అంటున్నారు... 175 కు 175 స్థానాల్లో గెలుస్తామని అంటున్నారన్నారు.

వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) పని అయి పోయిందని, ప్రజలు బయటకు వస్తున్నారని రఘురామ అన్నారు. టీడీపీ అభ్యర్థులు శ్రీకాంత్, భూమి రెడ్డి రామ గోపాల్ రెడ్డి ఖర్చు చేయలేదని.. వైసీపీ శ్రేణులు ఎక్కువగా ఖర్చు పెట్టారని తెలియవచ్చిందన్నారు. టీడీపీ (TDP)కి మెజారిటీ వచ్చిందంటే ధన ప్రవాహం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రపు నిర్ణయం తీసుకున్నారు...రాజధాని మార్పుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుని పోవడం ఖాయమని అన్నారు.

డబ్బులతో రాజకీయం చేయడం మానాలని ఎంపీ రఘురామ సూచించారు. ఎవరు నిలబడగలరు, ఎవరు అండగా ఉంటారో నమ్ముతూ.. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చారన్నారు. కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య (YS Viveka Murder Case) ప్రభావం చాలా ఉందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-18T16:31:18+05:30 IST