Eluru: జగన్ పాలనపై ఓ వ్యక్తి వినూత్న నిరసన

ABN , First Publish Date - 2023-02-08T13:57:39+05:30 IST

జగన్ పాలన (Jagan Govt.)పై అన్నీ వర్గాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతునే ఉన్నాయి. కొందరు వ్యక్తులు బాహటంగానే విమర్శలు చేస్తుండగా వివిధ మార్గాల్లో తమ కోపాన్ని, ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.

Eluru: జగన్ పాలనపై ఓ వ్యక్తి వినూత్న నిరసన

ఏలూరు: జగన్ పాలన (Jagan Govt.)పై అన్నీ వర్గాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతునే ఉన్నాయి. కొందరు వ్యక్తులు బాహటంగానే విమర్శలు చేస్తుండగా వివిధ మార్గాల్లో తమ కోపాన్ని, ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో పది రూపాయల నోటు (Ten Rupee Note)పై జగన్ పాలన గురించి ఓ వ్యక్తి తనదైన శైలిలో విమర్శలు చేశారు. జగన్ పాలనలో మందుబాబులు ఏ విధంగా రెచ్చిపోతున్నారో.. మహిళలపై అకృత్యాలు ఎలా పెరిగిపోయాయో.. రెండు ముక్కల్లో పది రూపాయల నోటుపై రాసి ఆవేదనను వెళ్లగక్కాడు. ‘జగన్ పాలనలో తాగుబోతుల వలన, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని, నేటి బాలలే.. రేపటి తాగుబోతులు అంటూ’ ఆ నోటుపై రాశారు. 2021 నవంబర్‌లో ఈ నోటుపై రాసినట్లు తేదీ కూడా వేశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి పాలనలో నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కరెంట్, ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నాసిరకం మద్యం అమ్మకాలు జగన్ రెడ్డి పాలన సైకో పాలనను తలపిస్తోందని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో జరిగిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి జగన్ రెడ్డి సైకో పాలన గురించి వివరించారు. ప్రజల తరుపున జగన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడుతున్నమని, ప్రజలందరూ ఈ పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన శ్రీనివాసులు అన్నారు.

Updated Date - 2023-02-08T13:57:42+05:30 IST