Amaravathi రైతులపై మంత్రి బొత్స మండిపాటు..

ABN , First Publish Date - 2023-05-09T15:50:02+05:30 IST

మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botha Satyanarayana) అమరావతి రైతులపై (Amaravathi Farmers) మండిపడ్డారు.

 Amaravathi రైతులపై మంత్రి బొత్స మండిపాటు..

విజయనగరం: మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botha Satyanarayana) అమరావతి రైతులపై (Amaravathi Farmers) మండిపడ్డారు. మంగళవారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని అంటే అదేమైనా బ్రహ్మపదార్ధమా? అని ప్రశ్నించారు. అమరావతిలో ఉన్న 30 వేల ఎకరాల భూములు భవనాల కోసమేనా?.. అమరావతిలో పేదవారికి ఇంటి స్ధలాలు కేటాయించటం తప్పా? అని అన్నారు. అమరావతి భూములు ప్రైవేటు వ్యక్తులవి కావని, ఆ భూములు ప్రభుత్వానివని పేర్కొన్నారు. ప్రభుత్వం చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవటం లేదని, కోర్టు తీర్పుకు అనుగుణంగానే అమరావతి భూముల్లో హద్దు రాళ్లు వేస్తు, పేదలకు పంపిణీ చేస్తున్నామని, అమరావతి అంటే ప్రైవేటు వెంచరు కాదని మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-09T15:50:02+05:30 IST