Pranav Gopal: వైసీపీ కార్యాలయాలుగా విశ్వవిద్యాలయాలు
ABN , Publish Date - Dec 25 , 2023 | 01:49 PM
విశాఖ: వైసీపీ ప్రభుత్వంపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని, ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ సీటు కంటే వీసీ సీటు గిరాకిగా మార్చారని ఆరోపించారు.
విశాఖ: వైసీపీ ప్రభుత్వంపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని, ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ సీటు కంటే వీసీ సీటు గిరాకిగా మార్చారని ఆరోపించారు. వీసీలకు యూనివర్సిటీల నిధులను ప్రధాన ఆదాయ వనరుగా చేసుకున్నారని, యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు, పేర్లు పెట్టడం మీద ఉన్న శ్రద్ద విద్యార్ధుల భవిష్యత్ మీద పెట్టలేకపోతున్నారని విమర్శించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాకింగ్ ఫ్రేం వర్క్ ప్రకారం 2019లో ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో 29వ ర్యాంకులో ఉంటే.. 2023లో 76వ ర్యాంకుకు దిగజార్చారన్నారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ రద్దు చేయడంతో వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధులను ఉన్నత విద్యకు దూరం చేశారని ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు.