Share News

Pranav Gopal: ఆర్జీవీకి అంత సరదాగా ఉంటే జగన్ మీద సినిమా తీసుకోవాలి..

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:57 AM

విశాఖ: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఓ సైకో సీఎంకు మద్దతుగా ఇంకో సైకో డైరెక్టర్ సినిమాయే ‘వ్యూహం’ అని విమర్శించారు.

Pranav Gopal: ఆర్జీవీకి అంత సరదాగా ఉంటే జగన్ మీద సినిమా తీసుకోవాలి..

విశాఖ: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఓ సైకో సీఎంకు మద్దతుగా ఇంకో సైకో డైరెక్టర్ సినిమాయే ‘వ్యూహం’ అని విమర్శించారు. ఆ సినిమాలో చంద్రబాబు, లోకేష్, పవన్‌లను కించపరిచే విధంగా చిత్రీకరించడం తెలుగు ప్రజలకు అవమానకరమన్నారు.

కుటుంబ సభ్యులతో పోర్న్ సినిమాలు చూసే వర్మ లాంటి నీతిమాలిక వ్యక్తికి వైసీపీ వంత పాడుతోందని ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. ఆర్జీవీకి అంత సరాదాగా ఉంటే జగన్ నీచ సంస్కృతి మీద సినిమా తీసుకోవాలని... అప్పుడు ప్రజలు హర్షిస్తారన్నారు. ఏ దర్శకుడైనా స్పూర్తిదాయమకమైన, సందేశాత్మకమైన సినిమాలు తీస్తారు కాని వర్మ లాంటి సైకో డైరెక్టర్ మాత్రం ఇలాంటి సినిమాలే తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న చంద్రబాబు లాంటి విజనరీ మీద ఇలాంటి తప్పుడు సందేశాన్నిచ్చే సినిమా తీస్తే తాట తీస్తామన్నారు. వ్యూహం సినిమాను ఆపకపోతే సైకో వర్మ కార్యాలయం, ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టే ఈ సినిమాను ధియేటర్ల వద్ద ప్రజలే అడ్డుకుంటారని ప్రణవ్ గోపాల్ అన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:57 AM