Minister Botsa: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన ఏపీ వ్యక్తికి ఎక్స్‌గ్రేసియా ప్రకటించిన మంత్రి బొత్స

ABN , First Publish Date - 2023-06-04T13:57:34+05:30 IST

విశాఖ: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో రైలు ప్రమాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ...

Minister Botsa: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన ఏపీ వ్యక్తికి ఎక్స్‌గ్రేసియా ప్రకటించిన మంత్రి బొత్స

విశాఖ: ఒడిశా (Odisha)లోని బాలాసోర్ జిల్లా (Balasore District)లో రైలు ప్రమాదం (Rain Accident)పై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఆదివారం మీడియాతో మాట్లాడారు. విశాఖ (Visakha)లో మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) వ్యక్తి కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా (Rs. 10 Lakhs Ex Gratia) అందిస్తామని ఆయన ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున అందిస్తామన్నారు.

కేంద్ర సహాయానికి ఇది అదనం సహాయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఒడిశాలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Minister Gudivada Amarnath) బృందం ఉందని.. అందులో ముగ్గురు ఐఎఎస్ (IAS), ముగ్గురు ఐపీఎస్ (IPS) అధికారులు ఉన్నారన్నారు. సహాయ కార్యక్రమాలు చేస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు రైలు ప్రమాదంలో 275 మంది చనిపోయారని స్థానిక జిల్లా కలెక్టర్ చెప్పారన్నారు. ఇందులో ఏపీకి చెందిన గురుమూర్తి ఉన్నారని తెలిపారు. సహాయం కోసం 50 అంబులెన్స్‌లు, ఒక చాపర్ అందుబాటులో ఉంచామన్నారు. విశాఖ ఆసుపత్రిలో ఐదుగురు చికిత్స పొందుతున్నారని, మరో నలుగురు ఆన్ ది వేలో వస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2023-06-04T14:40:14+05:30 IST