Minister Bosta: విశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం సంతోషం

ABN , First Publish Date - 2023-09-05T17:48:15+05:30 IST

విశాఖపట్నం: విశాఖలో ఉపాధ్యాయ దినత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్య వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారని, ఇప్పుడు దేశం మొత్తం ఏపీ రాష్ట్ర విద్య వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు.

Minister Bosta: విశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం సంతోషం

విశాఖపట్నం: విశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇతర రాష్ట్రాల విద్య వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారని, ఇప్పుడు దేశం మొత్తం ఏపీ రాష్ట్ర విద్య వ్యవస్థ (AP State Education System) గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. విద్య కోసం రూ. 12 వేల కోట్లు సీఎం జగన్ (CM Jagan) ఖర్చు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ట్యాబ్‌లు (Tabs) ఇస్తున్నారని.. 60 వేల క్లాస్ రూమ్‌లలో డిజిటల్ తరగతులు (Digital Classes) నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. విద్యపై ఖర్చు చేసేది సంక్షేమం కాదని.. రాష్ట్రం మీద పెట్టుబడి అని చెప్పారు.

ఉపాధ్యాయలు మా కుటుంబ సభ్యులేనని, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కొన్ని పత్రికలు చూస్తున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. జీతాలు ఇవ్వలేదని వార్తలు రాస్తున్నాయని, జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందా? అని ప్రశ్నించారు. అన్ని విశ్వ విద్యాలయాల్లో అన్ని పోస్టులు డిసెంబర్ నాటికి భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ పాటశాలల్లో నో వేకెన్సీ బోర్డులు కనిపిస్తున్నాయని, ప్రైవేట్ పాఠాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమమైన ర్యాంకులు వచ్చాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-05T19:42:15+05:30 IST