AP News: అనకాపల్లిలో వెలుగుచూసిన ఘరానా సైబర్ నేరం..

ABN , First Publish Date - 2023-02-25T11:09:38+05:30 IST

అనకాపల్లిలో ఘరానా సైబర్ మోసం (Gharana Cyber Fraud) వెలుగుచూసింది. జిల్లా కలెక్టర్ ఫోటోతో ఉన్న యాప్ (App) ద్వారా డబ్బు పంపాలని అనకాపల్లి ఆర్డీవో (RDO) చిన్ని కృష్ణకు వాట్స్ యాప్ సందేశం వచ్చింది.

AP News: అనకాపల్లిలో వెలుగుచూసిన ఘరానా సైబర్ నేరం..

విశాఖ: అనకాపల్లిలో ఘరానా సైబర్ మోసం (Gharana Cyber Fraud) వెలుగుచూసింది. జిల్లా కలెక్టర్ ఫోటోతో ఉన్న యాప్ (App) ద్వారా డబ్బు పంపాలని అనకాపల్లి ఆర్డీవో (RDO) చిన్ని కృష్ణకు వాట్స్ యాప్ సందేశం వచ్చింది. రూ. 10వేల చొప్పున మొత్తం రూ. 50 వేలు ఆర్డీవో ఆ యాప్‌కు పంపించారు. తర్వాత అది తప్పుడు యాప్ అని తెలుసుకుని ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రుషికేష్‌కు చెందిన నిఖిల్ గోయల్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అనకాపల్లి జిల్లా కలెక్టర్ పేరు మీద సైబర్ మోసం బయటపడింది. కలెక్టర్ నుంచి ఆర్డీవోకు ఒక మెసేజ్ వెళ్లినట్లు సమాచారం. ప్రతి ఒక్కరూ ఆ అకౌంట్‌కు డబ్బులు వేయాలన్నదే ఆ సమాచారం. అయితే కలెక్టర్ ఫోటో ఉండడంతో ఆయనే పంపించారని.. ఆర్డీవో అందరికీ ఈ సమాచారం చేరవేశారు. దీంతో కొంతమంది కలిసి సుమారు రూ. 50 వేలు పంపించారు. తర్వాత కలెక్టర్ యాప్ పంపించి డబ్బులు పంపమన్నారా? అన్న అనుమానం వచ్చి ఆర్డీవో కలెక్టర్‌తో మాట్లాడారు. డబ్బులు పంపాలని తాను యాప్ సమాచారం ఇవ్వలేదని, ఇదంతా మోసం అని చెప్పడంతో ఆర్డీవో అవాక్కయ్యారు.

ఈ సైబర్ మోసంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు.. నిఖిల్ గోయల్ అనే యువకుడిని అరెస్టు చేశారు. రుషికేష్ నుంచి యాప్ ద్వారా రూ. 50 వేలు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2023-02-25T11:09:42+05:30 IST