Adimulapu Suresh: మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2023-03-26T11:32:09+05:30 IST

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‎కు(AP Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం

Adimulapu Suresh: మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

విశాఖపట్నం: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‎కు(AP Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. G20 సన్నాహక సమావేశాలు(G20 preparatory meetings), స్వాగతం పలుకుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే.. ఆదివారం విశాఖ ఆర్కే బీచ్‎లో(Visakha RK Beach) పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. గాలివాటం సరిగా లేకపోవడంతో వన్ సైడ్‎కి ఒరిగిపోయింది. దీంతో మంత్రికి వ్యక్తిగతమైన సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో మంత్రి సురేష్(Minister Suresh) ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇలా ఒక్కసారిగా క్షణాల్లో జరిగిపోవడంతో అక్కడున్న ఇతర మంత్రులు షాక్‎కుగురయ్యారు. మంత్రికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2023-03-26T11:33:17+05:30 IST