Vangalapudi Anitha: సీఎం జగన్‌పై అనిత ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-16T20:24:59+05:30 IST
సొంత బాబాయికి లేని పోని సంబంధాలు అంటగట్టారు.. సొంత చెల్లికే దిక్కు లేదు..మేము ఎంత?. హోం మంత్రి ఇంట్లోనే ఉండి పోతున్నారు. మహిళ సమస్యలను పట్టించుకోవడం లేదు. కొంతమంది వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.
విశాఖపట్నం: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM Jaganmohan Reddy)పై టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శలు గుప్పించారు.
"సొంత బాబాయికి లేని పోని సంబంధాలు అంటగట్టారు.. సొంత చెల్లికే దిక్కు లేదు..మేము ఎంత?. హోం మంత్రి ఇంట్లోనే ఉండి పోతున్నారు. మహిళ సమస్యలను పట్టించుకోవడం లేదు. కొంతమంది వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సెప్టెంబర్ నెలలో సీఎం విశాఖకు వస్తామని అంటున్నారు. చెప్పులతో స్వాగతం పలుకుతారు. మహిళా సమస్యలపై మేము పోరాటం చేస్తుంటే...వైసీపీ సోషల్ మీడియా గజ్జి కుక్కలు మోరుగుతున్నాయి. పేటీఎం డాగ్స్ నోటికి వచ్చినట్లు వాగుతున్నాయి. అసభ్యపద జాలాన్ని వాడుతున్నాయి. ఒక మనిషికి పుట్టిన వాడు ఇలా చేయరు. ఊరు పేరు లేని పేపర్లలో నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నాపై రాయిస్తున్నది భారతి రెడ్డే. ఇదంతా సజ్జల భార్గవ్ రెడ్డి స్క్రిప్ట్‌తోనే జరుగుతుంది నా ఫోటోలను ప్రొఫైల్ పిక్‌లుగా పెట్టుకుంటున్నారు. నాపై అసత్య, అభ్యంతర కరమైన వార్తలు ప్రచురిస్తున్నారు. నేను ఎవర్ని వదిలి పెట్టను. డీజీపీ 6 నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి పోస్టులకు ఏడిచేది లేదు. ఏడిపిస్తాను. 6 నెలలు ఆగండి. జగన్ జైలులో ఉంటారు. పోలీసు వ్యవస్థ మా దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాను. వదిలే ప్రసక్తే లేదు. నేను చదువుకున్న దళిత ఆడ బిడ్డను. మీరు పెడుతున్న పోస్టులకు భయపడను. నా కొడకల్లారా... మీ ఇష్ట వచ్చినట్లు పోస్టులు పెట్టండి. ఇంకా పెట్టండి. బెదిరేది లేదు. పోలీసులు సుమోటోగా కేసు తీసుకోవాలి. డీజీపీని కోరుతున్నాను. తప్పుడు పోస్టులు పెట్టేవాడుదొరికితే ఇక నుంచి తంతాం." అని అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.