Union Home Ministry: జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల నమోదు- కేంద్ర హోంశాఖ వెల్లడి

ABN , First Publish Date - 2023-07-26T17:43:18+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో (Jagan Govt) భారీగా బాలికలు, మహిళలు మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ (Union Home Ministry) వెల్లడించింది. ఏపీలో భారీగా బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు నమోదు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఏపీలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని, ఏపీతో పాటు తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.

Union Home Ministry: జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల నమోదు- కేంద్ర హోంశాఖ వెల్లడి

ఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో (Jagan Govt) భారీగా బాలికలు, మహిళలు మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ (Union Home Ministry) వెల్లడించింది. ఏపీలో భారీగా బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు నమోదు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఏపీలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని, ఏపీతో పాటు తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 18 ఏళ్ల లోపు బాలికలు, 18 ఏళ్లు దాటిన మహిళల మిస్సింగ్ కేసులకు సంబంధించి వివరాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది.


"2019 నుంచి 2021 వరకు మూడు ఏళ్లలో ఏపీలో మొత్తం 7928 బాలికలు, 22278 మహిళలు మిస్సింగ్ కేసులు నమోదు. 2019లో ఏపీ నుంచి 2186 బాలికలు, 6252 మహిళల మిస్సింగ్ కేసులు. 2020లో ఏపీ నుండి 2374, బాలికలు 7057 మంది మహిళల మిస్సింగ్ కేసులు. 2021లో ఏపీ నుంచి 3358 బాలికలు, 8969 మంది మహిళల మిస్సింగ్ కేసులు. 2019 నుంచి 2021 వరకు మూడు ఏళ్లలో తెలంగాణలో మొత్తం 8066 మంది బాలికలు, 34495 మహిళలు మిస్సింగ్ నమోదు. 2019లో తెలంగాణ నుంచి 2849 మంది బాలికలు, 10744 మహిళల మిస్సింగ్ కేసులు నమోదు. 2020లో తెలంగాణలో 2232 మంది బాలికలు, 10917 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదు. 2021లో తెలంగాణ లో 2994 మంది బాలికలు, 12834 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదు." అయ్యాయని పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది.

Updated Date - 2023-07-26T17:57:29+05:30 IST