Central Govt: ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పష్టత
ABN , First Publish Date - 2023-07-21T13:20:12+05:30 IST
ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పార్లమెంటు సాక్షిగా హైకోర్టు తరలింపుపై కేంద్రం సమాధానం చెప్పింది.
న్యూఢిల్లీ: ఏపీ హైకోర్టు (AP Highcourt) తరలింపుపై కేంద్రం (Central Government) స్పష్టతనిచ్చింది. పార్లమెంటు (Parliament) సాక్షిగా హైకోర్టు తరలింపుపై కేంద్రం సమాధానం చెప్పింది. హైకోర్టును కర్నూల్‌కు మార్చుతామంటూ ఏపీ సీఎం జగన్ (AP CM Jagan reddy) ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం స్పష్టత నిచ్చింది. శుక్రవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటు అయ్యిందని కేంద్రం పేర్కొంది. 2019 జనవరి ఒకటి నుంచి అమరావతిలో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో లేదని తెలిపింది. హైకోర్టు తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సి ఉందని చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2014 విభజన చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటై 2019 జనవరి ఒకటి నుంచి పనిచేస్తోందని.. 2020లో ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్ తరలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదించారని కేంద్రం తెలిపింది. రాష్ట్ర హైకోర్టును సంప్రదించి తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది.