Rayapati: 'గుంటూరు' రాజకీయాలపై రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-04-20T18:19:58+05:30 IST
గుంటూరు' రాజకీయాలపై (Guntur politics) టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు (TDP senior leader Rayapati Sambasiva Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'గుంటూరు' రాజకీయాలపై (Guntur politics) టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు (TDP senior leader Rayapati Sambasiva Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఆయన వెల్లడించారు. చంద్రబాబు చెబితే నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని రాయపాటి స్పష్టం చేశారు. గతంలో డబ్బులు లేక ఓడిపోయానని, తమ కుమారుడు రంగబాబుకు సీటు ఇవ్వాలని అడుగుతున్నామని రాయపాటి తెలిపారు. సత్తెనపల్లి, పెదకూరపాడు ఎక్కడ సీటు ఇస్తారో చంద్రబాబు ఇష్టమని, తమ తమ్ముడి కూతురు శైలజకు కూడా టికెట్ అడుగుతున్నామని, వారికి టికెట్ ఇస్తే.. తనకు ఇవ్వకున్నా పర్వాలేదని రాయపాటి తన మనసులో మాట బయటపెట్టారు. కన్నాకు ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలుస్తారని, నరసరావుపేటకు స్థానికులే అభ్యర్థిగా ఉండాలని రాయపాటి పేర్కొన్నారు.
ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కలిశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. తర్వాత అక్కడ ఉన్న మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. తాను రాజకీయాల నుంచి రిటైరయ్యానని, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు, కుమార్తె పోటీ చేయడానికి రెండు సీట్లు ఇవ్వాలని పార్టీ అధినేతకు విజ్ఞప్తి చేశానని చెప్పారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు తమ కుటుంబానికి ఇవ్వాలని కోరానని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మంచివారికి సీట్లు ఇవ్వడం ద్వారా పార్టీ ఈ గెలుపును అందుకోవాలని రాయపాటి అభిప్రాయపడ్డారు.