Share News

Balakrishna: చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ చెలగాటం

ABN , First Publish Date - 2023-10-13T15:37:00+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Balakrishna: చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ చెలగాటం

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఆరోగ్యంతో జగన్ రెడ్డి (CM Jaganreddy) చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ (TDP MLA Balakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిలో చంద్రబాబును ఎదుర్కోలేక అక్రమ కేసులతో జైలుపాలు చేసినా పగ చల్లారలేదా? అని ప్రశ్నించారు. 73 ఏళ్ల వయసులో పెద్దాయన్ను ఇబ్బంది పెడతారా అంటూ మండిపడ్డారు. ఫేక్ హెల్త్ రిపోర్టులు ఇచ్చి ఎవరిని మభ్య పెడదామనుకుంటున్నారని నిలదీశారు. చంద్రబాబు‌కు వైద్యం అందించేందుకు వ్యక్తిగత వైద్యలను అనుమతించాలని.. ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత అని బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-13T15:37:00+05:30 IST