Share News

YuavaGalam: యలమంచిలిలో లోకేష్‌కు వినతిపత్రం సమర్పించిన ప్రజలు

ABN , Publish Date - Dec 14 , 2023 | 02:15 PM

Andhrapradesh: యలమంచిలి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యలమంచిలి కోర్టు రోడ్డులో పట్టణ ప్రజలు పలు సమస్యలపై లోకేష్‌కు ప్రజలు వినతిపత్రం సమర్పిస్తున్నారు.

YuavaGalam: యలమంచిలిలో లోకేష్‌కు వినతిపత్రం సమర్పించిన ప్రజలు

అనకాపల్లి: యలమంచిలి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nar Lokesh) కొనసాగుతోంది. యలమంచిలి కోర్టు రోడ్డులో పట్టణ ప్రజలు పలు సమస్యలపై లోకేష్‌కు ప్రజలు వినతిపత్రం సమర్పిస్తున్నారు. 8 శివారు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం యలమంచిలి మున్సిపాలిటీలో విలీనం వలన ఇబ్బందులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. టిడ్కో ఇళ్లకు గత పాలనలో ఉన్న లబ్ధిదారుల పేర్లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ - జనసేన అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేసి గతంలో లబ్ధిదారులకే ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని యువనేత భరోసా ఇచ్చారు.


అలాగే పాదయాత్రలో లోకేష్‌ను న్యాయవాదులు కలిశారు. తమ ఎదుర్కుంటున్న సమస్యలను వినతిపత్రం ద్వారా లోకేష్‌కు అందజేశారు. కొత్తపాలెం సమీపంలో ఇటీవల తుఫానుకు దెబ్బతిన్న వరి పంటను లోకేష్ పరిశీలించారు. కొత్తపాలెం చెరుకు కొనుగోలు కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామం వద్దకు లోకేష్ చేరుకున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 03:00 PM