Share News

YuvaGalam: 220వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2023-12-12T11:57:43+05:30 IST

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రం 220వరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నామవరం నుంచి 220వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.

YuvaGalam: 220వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

అనకాపల్లి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 220వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నామవరం నుంచి 220వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట మండలం నామవరంలో లోకేష్‌ను తమలపాకు రైతులు కలిశారు. తమలపాకు తోటలకు పంట బీమా సౌకర్యం కల్పించాలని వినతి చేశారు.


లోకేష్ స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) చేతగాని పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. పంటలబీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి, కేవలం 16 మంది రైతులకు మాత్రమే బీమా చెల్లించి నట్టేటముంచిన మోసగాడు జగన్ అని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలచిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-12-12T11:57:44+05:30 IST