Share News

Lokesh: జనసేన నేతల అరెస్ట్‌ను ఖండించిన లోకేష్

ABN , First Publish Date - 2023-12-11T16:38:51+05:30 IST

Andhrapradesh: విశాఖలో జనసేన నేతల అరెస్ట్‌పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జనసేన నేతల అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

Lokesh: జనసేన నేతల అరెస్ట్‌ను ఖండించిన లోకేష్

అమరావతి: విశాఖలో జనసేన నేతల అరెస్ట్‌పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జనసేన నేతల అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడుదామని లోకేష్ పిలుపునిచ్చారు.


కాగా.. విశాఖలో నోవోటల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేష్ బాబు, కోన తాతారావు సహా పలువురు జనసేన నేతలు హోటల్‌ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం తోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన నేతలు నినాదాలు చేశారు. హలో ఏపీ... బై బై వైసీపీ అంటూ నోవాటల్ వద్ద నినాదాలు హోరెత్తాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-12-11T16:38:55+05:30 IST