కంకిపాడు తెలుగు యువత జిల్లా కార్యదర్శి అరెస్ట్

ABN , First Publish Date - 2023-09-28T10:37:15+05:30 IST

కృష్ణా జిల్లా కంకిపాడు తెలుగు యువత జిల్లా కార్యదర్శి బొర్రా వెంకట్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి మచిలీపట్నం తరలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టినందుకుగానూ వెంకట్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

కంకిపాడు తెలుగు యువత జిల్లా కార్యదర్శి అరెస్ట్

విజయవాడ : కృష్ణా జిల్లా కంకిపాడు తెలుగు యువత జిల్లా కార్యదర్శి బొర్రా వెంకట్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి మచిలీపట్నం తరలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టినందుకుగానూ వెంకట్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన ఉయ్యూరులో జరిగిన నిరసన దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అదుపులోకి తీసుకున్నారని మరో టాక్ కూడా నడుస్తోంది. సమాచారం అందుకున్న కంకిపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Updated Date - 2023-09-28T10:37:15+05:30 IST