AP High Court: చంద్రబాబును అరెస్ట్ చేయబోం.. తేల్చిచెప్పిన సీఐడీ
ABN , First Publish Date - 2023-11-08T15:08:23+05:30 IST
ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం విచారణ జరిగింది. విచారణలో భాగంగా చంద్రబాబును ఈనెల 28 వరకు అరెస్ట్ చేయమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
అమరావతి: ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో (AP Highcourt) ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం విచారణ జరిగింది. విచారణలో భాగంగా చంద్రబాబును ఈనెల 28 వరకు అరెస్ట్ చేయమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇసుక కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు రాగా.. తాము చంద్రబాబును 28 వరకు అరెస్ట్ చేయబోమని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. సీఐడీ న్యాయవాదుల స్టేట్‌మెంట్‌ను హైకోర్టు ధర్మాసనం రికార్డ్ చేసింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. కాగా.. ఈ నెల 28 వరకు చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.