Anitha: జగన్ వెన్నులో వణుకు.. ఇది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ముందుంది

ABN , First Publish Date - 2023-07-13T19:05:22+05:30 IST

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM Jaganmohan Reddy) టీడీపీ నాయకురాలు (TDP leader), తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శలు గుప్పించారు.

Anitha: జగన్ వెన్నులో వణుకు.. ఇది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ముందుంది

అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM Jaganmohan Reddy) టీడీపీ నాయకురాలు (TDP leader), తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శలు గుప్పించారు. మహిళాశక్తి పథకాలు జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని, జగన్మోహన్ రెడ్డిలాగా కోతలు, వాతలు లేకుండా సక్రమంగా సగర్వంగా పథకాలు అమలు చేస్తామని ఆమె అన్నారు.


"మహిళాశక్తి పథకాల ప్రచార ఆడియోను తెలుగు మహిళలు విడుదల చేశారు. చంద్రబాబు ప్రకటించిన మహిళాశక్తి పథకాలు కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. మహానాడు సాక్షిగా టీడీపీ ప్రకటించిన పథకాలపై మహిళాలోకం హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తోంది. మహిళాశక్తి పథకాలు జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలుఘోరాలపై ముఖ్యమంత్రిని నిలదీయలేని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా నేతలు ప్రతిపక్షాలను బూతులు తిట్టడంలో పోటీపడుతున్నారు. మహిళాశక్తి పథకాలు అర్హులైన వైసీపీ మహిళా నేతలకు, మహిళా మంత్రులకు కూడా అందిస్తాం. జగన్మోహన్ రెడ్డిలాగా కోతలు, వాతలు లేకుండా సక్రమంగా సగర్వంగా పథకాలు అమలు చేస్తాం. దేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిపథంలో నడిపింది. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. చంద్రబాబునాయుడు డ్వాక్రాసంఘాలతో తెలుగుమహిళల శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారు." అని అనిత అన్నారు.

Updated Date - 2023-07-13T19:09:16+05:30 IST