Anitha: అసభ్యకర పోస్టింగ్స్ పెట్టే రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-07-02T22:17:56+05:30 IST
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (JAGAN) తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శలు గుపించారు. వర్ర రవీంద్రరెడ్డి (Ravindra Reddy) జగన్ రెడ్డి, భారతి కన్నుసన్నల్లో పని చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకునేందుకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వెనుకాడుతోందా? అని ఆమె ప్రశ్నించారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (JAGAN) తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శలు గుప్పించారు. వర్ర రవీంద్రరెడ్డి (Ravindra Reddy) జగన్ రెడ్డి, భారతి కన్నుసన్నల్లో పని చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకునేందుకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వెనుకాడుతోందా? అని ఆమె ప్రశ్నించారు. రవీంద్రరెడ్డి లాంటి నీతిమాలిన వెధవలు వైసీపీలో చాలా మంది ఉన్నారని అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారందరిపై డీజీపీ ఏం చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్న రవీంద్రరెడ్డి భవిష్యత్‌లో దారుణమైన పర్యవసానాలు ఎదుర్కొంటారని, రవీంద్రరెడ్డి చనువుగా నవ్వుతూ తనతో దిగిన ఫోటోలపై భారతిరెడ్డి ఏం సమాధానం చెబుతారు? ఆమె అన్నారు.
టీడీపీ మహిళలు, కార్యకర్తలపై సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర కామెంట్స్, పోస్టింగ్స్, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు కనిపించడంలేదా? అని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందిపోయి నాణేనికి ఒక వైపేచూసి మాట్లాడటం సరైందికాదన్నారు. మహిళలకు జరిగే అవమానాలు, వేధింపులపై మాట్లాడితే చంద్రబాబుని అనరాని మాటలంటారా?, రవీంద్రరెడ్డి ఫేస్ బుక్ లింక్ చూశాక ఒక మహిళా స్పందన ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నామన్నారు. సోషల్ మీడియా వేదికగా వచ్చే కామెంట్స్, పోస్టింగ్స్ పై మహిళా కమిషన్ చేయబోయే యుద్ధంలో తమను భాగస్వామ్యం చేయాలని కోరుతున్నామని అనిత అన్నారు.