Share News

Supreme Court: పోలవరంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2023-12-11T14:44:41+05:30 IST

Andhrapradesh: పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఖర్చు భరించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పిటిషన్ దాఖలు చేశారు.

Supreme Court: పోలవరంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌పై (Polavaram Project) కేంద్రానికి సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఖర్చు భరించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు (Former MP KVP Ramachandrarao) పిటిషన్ దాఖలు చేశారు. కేవీపీ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీంను కేంద్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో ఏపీ హైకోర్టుకే వెళ్లాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ 2019లో సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంలో విచారణకు రాగా.. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నుంచి బదిలీ చేయాలంటూ కేంద్రం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఏపీ హైకోర్టులోనే తన వాదనలను వినిపించుకోవాలంటూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Updated Date - 2023-12-11T14:44:42+05:30 IST