YCP: మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-04-03T20:24:53+05:30 IST

మంత్రి దర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) హాట్ వ్యాఖ్యలు చేశారు.

YCP: మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్

శ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) హాట్ వ్యాఖ్యలు చేశారు. పథకాలకు సీఎం జగన్ (CM Jagan) ఇంట్లోది ఇస్తున్నారా అని కొంతమంది మహిళలు అంటున్నారని, ఎవరైనా ఇంట్లోది ఇస్తామంటే వారి ఇంటికి వెళదామని వ్యాఖ్యానించారు. పథకాల డబ్బులు తీసుకుని కూడా సంస్కారవంతమైన మాట రాకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వాన్ని మరలా గెలిపించకపోతే మీ రెండు చేతులు మీరు నరుక్కున్నట్టేనన్నారు.

తాను గెలువక పోతే వచ్చే నష్టం ఏం లేదని, తాను పోటీ చేయడం, గెలవడం ఇష్యూ కాదన్నారు. గెలిస్తే మీ చాకిరీ చేస్తా... ఓడిపోతే మీ స్నేహితుడిగా ఉంటానన్నారు. మీ వైపు ఆలోచించే ప్రభుత్వాన్ని మీరు గెలిపించుకోండని సూచించారు. తాను కొన్ని సిద్దాంతాలు, భావాజాలలుపై పనిచేస్తానని చెప్పారు. తన పదవితో తనకు సంబంధం లేదన్నారు. నలబై ఏళ్లుగా తన గౌరవాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు... కానీ, ఇంచీ కూడా తగ్గలేదన్నారు. చెప్పడానికి ఏం లేక నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బంధువులతో సరుకుల ధరలపై ఇతర రాష్ట్రాల్లో వాకాబు చేయండని సూచించారు.

Updated Date - 2023-04-03T20:51:06+05:30 IST