Rains: ఉత్తరకోస్తాలో వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండలు

ABN , First Publish Date - 2023-03-25T20:40:43+05:30 IST

రాష్ట్రంలో శనివారం ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో వర్షాలు కురవగా, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న

Rains: ఉత్తరకోస్తాలో వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండలు

విశాఖపట్నం: రాష్ట్రంలో శనివారం ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో వర్షాలు కురవగా, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమగాలులు, మధ్య భారతం నుంచి వస్తున్న పొడిగాలుల కలయికతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తరకోస్తాలో వర్షాలు కురిశాయి. విజయనగరం, విశాఖపట్నం (Vizianagaram Visakhapatnam), అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు (Rains) కురిశాయి. కాగా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. అనంతపురంలో 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా బిహార్‌ నుంచి జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh), విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతున్నందున రానున్న రెండు రోజుల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2023-03-25T20:41:58+05:30 IST