Pothina Mahesh : తల్లి, చెల్లి ఖైదీ నంబర్ 6093 పేరుతో జగన్‌పై వెబ్ సిరీస్ ప్లాన్ చేశా..
ABN , First Publish Date - 2023-08-02T12:56:05+05:30 IST
వైసీపీ నాయకులకు మంత్రులకు, జగన్‌కి పవన్ ఫోబియో పట్టుకుందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేరు విన్నా, ఫోటో చూసినా వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు.
విజయవాడ : వైసీపీ నాయకులకు మంత్రులకు, జగన్‌కి పవన్ ఫోబియో పట్టుకుందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేరు విన్నా, ఫోటో చూసినా వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. కేటాయించిన శాఖల మీద మాట్లాకుండా.. పవన్ పై మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. పవన్ వల్ల వైసీపీ ఓడిపోతుందనే వాస్తవంతో.. అందరికీ భయం పట్టుకుందన్నారు. బ్రో సినిమాపై నిర్మాతలు, డైరెక్టర్‌లు మాట్లాడతారని.. మంత్రులు ఎందుకు మాట్లాడటమని పోతిన మహేష్ ప్రశ్నించారు. మంత్రుల పదవులకు రాజీనామా చేసి సినిమా మ్యాగజైన్ నడుపుకోండి లేదంటే రివ్యూలు రాసుకోండంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం, ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర ప్రజా సమస్యలపై చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసురుతున్నామన్నారు. పవన్ పై అమ్మవారి ఆశీసులు ఉన్నాయన్నారు. జగన్‌కు, వైసీపీకి లేవని పోతిన మహేష్ అన్నారు.
ఇంకా పోతిన మహేష్ మాట్లాడుతూ.. ‘‘బ్లాక్ మనీని వైట్ మని చేయడంలో దిట్ట జగన్ మోహన్ రెడ్డి. నిమ్మగడ్డ ఎవరి పార్టనర్..? విదేశాల్లో జైలు జీవితం గడిపారు. జగన్ పై సినిమా తీయలనే ఆలోచన వొచ్చింది.. కానీ బడ్జెట్ లేదు. ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేశాను. దాని పేర్లు వచ్చేసి.. తల్లి, చెల్లి ఖైదీ నంబర్ 6093, - డాక్టర్ ఆఫ్ వివేక, గంజాయి మిస్ అయిన అమ్మాయి , మధ్యలో ఇసుక దిబ్బలు, కోడి కత్తి సమేత శ్రీను, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అదే ఇల్లు, ఒక ఖైదీ వదిలిన బాణం. వైసీపీ లో ఉన్న నటులు కూడా ట్రై చేసుకోవచ్చుతెల్ల జుట్టు ఉందని ఏమీ పక్కన పెట్టం.. ఏ ఒక్క విషయం విస్మరించం. అన్నీ వాస్తవాలు వివరిస్తాం.. బయట డైరెక్టర్ ని పెట్టి వెబ్ సిరీస్ తీస్తాం’’ అని పేర్కొన్నారు.