Share News

Palle Raghunath Reddy: వచ్చే ఎన్నికల్లో 100 శాతం వైసీపీ ఓటమి ఖాయం

ABN , First Publish Date - 2023-12-10T17:51:44+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతు ఆత్మహత్యల ప్రదే‌శ్‌గా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదే అని, వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి రాష్ట్రంలో పరిశ్రమలు రావడం మానేశాయని విమర్శించారు. కక్ష సాధింపులకు పాల్పడుతున్న సీఎం జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పల్లె జోస్యం చెప్పారు

Palle Raghunath Reddy: వచ్చే ఎన్నికల్లో 100 శాతం వైసీపీ ఓటమి ఖాయం

శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతు ఆత్మహత్యల ప్రదే‌శ్‌గా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదే అని, వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి రాష్ట్రంలో పరిశ్రమలు రావడం మానేశాయని విమర్శించారు. కక్ష సాధింపులకు పాల్పడుతున్న సీఎం జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పల్లె జోస్యం చెప్పారు.

"వైసీపీ రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం వదిలించుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారు. మన రాష్ట్రంలో సంక్షేమం ముసుగులో దోపిడీ తప్ప చేసింది ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో 100శాతం వైసీపీ ఓటమి ఖాయం. రైతు ఆత్మహత్యల ప్రదే‌శ్‌గా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదే. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి రాష్ట్రంలో పరిశ్రమలు రావడం మానేశాయి. కక్ష సాధింపులకు పాల్పడుతున్న సీఎం జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు." అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు.

పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఓబుళదేవరచెరువు నుంచి తంగేడు కుంట పంచాయతీ వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర టీడీపీ బైక్ ర్యాలీ సాగింది. బైక్ ర్యాలీలో తెలుగు తమ్ముళ్లు పూల వర్షం కురిపించికదం తొక్కారు. టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సహం పెల్లు ఉబికింది.

Updated Date - 2023-12-10T17:59:36+05:30 IST