Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు ఒకరోజు విరామం

ABN , First Publish Date - 2023-08-17T22:12:21+05:30 IST

యువగళం పాదయాత్రకు టీడీపీ (TDP) యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) ఒకరోజు విరామం ఇచ్చారు.

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు ఒకరోజు విరామం

అమరావతి: యువగళం పాదయాత్రకు టీడీపీ (TDP) యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) ఒకరోజు విరామం ఇచ్చారు. రేపు మంగళగిరి కోర్టుకు లోకేష్ వెళుతున్న నేపథ్యంలో ఒకరోజు పాదయాత్రకు విరామం ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. న‌టుడు, ద‌ర్శ‌కుడు, ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పోసాని కృష్ణముర‌ళి త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై లోకేష్ న్యాయ‌పోరాటం చేస్తున్నారు. సింగ‌లూరు శాంతి ప్ర‌సాద్‌పైనా ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. కోర్టులో వాంగ్మూలం న‌మోదు కోసం మంగళగిరి కోర్టుకు లోకేష్ వెళ్లనున్నారు.


యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 2496.5 కిలోమీటర్లు లోకేష్ నడిచారు. ఈ రోజు 10.2 కిలోమీటర్ల దూరం నడిచారు. ఉమ్మడి గుంటూరుజిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు 18-8-2023న పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. 188వరోజు పాదయాత్ర ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుంచి 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2023-08-17T22:21:45+05:30 IST