AP News: ఢిల్లీ చేరుకున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు..

ABN , First Publish Date - 2023-08-27T14:26:03+05:30 IST

సోమవారం (రేపు) రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా ఎన్టీఆర్ (NTR) వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యలు ఢిల్లీ చేరుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే.

AP News: ఢిల్లీ చేరుకున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు..

న్యూఢిల్లీ: సోమవారం (రేపు) రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా ఎన్టీఆర్ (NTR) వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యలు ఢిల్లీ చేరుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు పనిలో పనిగా ఏపీలో దొంగ నోట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే స్పష్టత లేకపోయినప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరవుతారని చెబుతున్నారు. కుటుంబ సభ్యులతోపాటు ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందాయి.


శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాణెం..

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఎన్టీఆర్ శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంది.

Updated Date - 2023-08-27T14:26:03+05:30 IST