Share News

Nellore: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ కుట్ర..!

ABN , First Publish Date - 2023-11-22T07:49:44+05:30 IST

నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ పెద్దలు భారీ కుట్రకు యత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కోటంరెడ్డిని ఓడించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.

Nellore: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ కుట్ర..!

నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ( Kotam Reddy Sridhar Reddy) వైసీపీ పెద్దలు భారీ కుట్రకు యత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కోటంరెడ్డిని ఓడించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నగరంలోని ఓ కళ్యాణమండపంలో బీఎల్వోలు (BLOs), వైసీపీ (YCP) నేతలతో ఎంపీ ఆదాల (MP Adala) రహస్య సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులు రాకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, బీఎల్వోలతో వైసీపీ నేతల సమావేశాలపై అధికారులు పట్టించుకోలేదు. వైసీపీ అడ్డగోలు వ్యవహారాలకు అధికారులు సహాకారిస్తున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా ఎన్నికల కమిషన్ మౌనం వహిస్తోంది. ఈసీ తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-11-22T07:49:47+05:30 IST